Header Banner

రోహిత్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్.! కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ..

  Fri May 30, 2025 21:50        Politics

కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించారు. ముల్లాన్‌పూర్‌లో పరుగుల వరద పారించారు. ఓపెనర్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 81) ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై భారీ స్కోరు సాధించింది. ముల్లాన్‌పూర్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. (GT vs MI). మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. గుజరాత్ ఎదుట భారీ టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ముంబై ఓపెనర్లు చెలరేగారు. గుజరాత్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడం కూడా ముంబైకు కలిసొచ్చింది. రోహిత్ శర్మ (81), జానీ బెయిర్‌స్టో (47) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. బెయిర్ స్టో అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్ (33) చూడచక్కని షాట్లతో అలరించాడు. ఆ తర్వాత తిలక్ వర్మ (25) కూడా మూడు సిక్స్‌లు కొట్టాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (22) కూడా వేగంగా పరుగులు చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia #IPL2025 #WinAgainstMI #MIvsGT